ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా చేపట్టాలి: కలెక్టర్

459చూసినవారు
ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా చేపట్టాలి: కలెక్టర్
జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను సమీక్షించారు. పార్వతీపురం నియోజకవర్గంలోని బెలమాం 25వ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, బీఎల్‌ఓలతో మాట్లాడారు. ఓటరు జాబితా సవరణలో నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించాలని ఆయన ఆదేశించారు. ఓటర్లకు పూర్తి సమాచారం అందించి, పారదర్శకంగా ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మాధురి, మున్సిపల్ కమిషనర్ పావని, తహసీల్దార్ సి. హెచ్. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్