ఆ కారణంతోనే కొట్టి చంపారా ?

178చూసినవారు
ఆ కారణంతోనే కొట్టి చంపారా ?
పార్వతీపురం (M) వెలగవలసలో చేతబడి నెపంతో రమేశ్ (30) అనే వ్యక్తిని గ్రామస్థులు కొట్టి చంపిన ఘటనలో, రెండు నెలలుగా గ్రామంలో అంతుచిక్కని రోగాలు ప్రబలుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రమేశ్ చేతబడి చేశాడని భావించిన గ్రామస్థులు అతడిని హత్య చేశారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే 16 మందిని అరెస్ట్ చేశారు. గిరిజన గ్రామాల్లో చేతబడిపై ప్రజలకు అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.