నెలాఖరులో జలధార పనులు పూర్తి చేయాలి: కలెక్టర్ ఆదేశాలు

132చూసినవారు
నెలాఖరులో జలధార పనులు పూర్తి చేయాలి: కలెక్టర్ ఆదేశాలు
పార్వతీపురం కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి, జలధార పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పనుల పురోగతిని సమీక్షించిన ఆయన, 100 రోజుల గడువులో 60 రోజులు పూర్తయ్యాయని, ప్రారంభం కాని పనులను వెంటనే మొదలుపెట్టి మంజూరైన పనులన్నీ 100% పూర్తి చేయాలని సూచించారు. నాణ్యతలో రాజీ పడకుండా క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణతో పనులను పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్