హెల్మెట్ ధరించండి... డ్రంక్ అండ్ డ్రైవ్‌కు దూరంగా ఉండండి

0చూసినవారు
హెల్మెట్ ధరించండి... డ్రంక్ అండ్ డ్రైవ్‌కు దూరంగా ఉండండి
పార్వతీపురం మన్యం జిల్లాలో, రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ప్లకార్డుల ద్వారా సూచించారు. నాణ్యమైన హెల్మెట్ ప్రాణాలను కాపాడుతుందని, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందని పోలీసులు వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణానికి సహకరించాలని ప్రజలను కోరారు.