శనివారం సాయంత్రం బాడంగి మండలం భీమవరంలో పిడుగుపాటుతో లచ్చుపతుల భవాని (42) అనే మహిళ మృతి చెందింది. పొలానికి ఆవులను మేపేందుకు వెళ్లి, తిరిగి ఇంటికి తోలుకొస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వాతావరణంలో ఆకస్మిక మార్పులతో కురిసిన వర్షం సమయంలో పిడుగు పడటంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. భర్త వెంకటరమణ, ఇద్దరు కుమారులకు ఆమె ఆధారం. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై సూర్యకుమారి మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.