మంత్రి పీఏ సతీష్‌పై మహిళ ఫిర్యాదు కలకలం

1302చూసినవారు
మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్సనల్ సెక్రటరీ బి. సతీష్‌పై ఒక మహిళ వేధింపుల ఆరోపణలు చేస్తూ మన్యం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సతీష్ తనను ఆర్థికంగా, శారీరకంగా వేధించాడని, మంత్రి కుమారుడు పృథ్వీ కూడా కొన్నిసార్లు మెసేజ్‌లు పంపారని ఆమె ఆరోపించారు. ఫిర్యాదు తర్వాత కూడా తనను గుమ్మలక్ష్మీపురానికి బదిలీ చేశారని, హైకోర్టు తీర్పు తర్వాత సతీష్ మరింత ఇబ్బంది పెడుతున్నారని బాధితురాలు పేర్కొన్నారు.