పాలకొండ మండలం బర్న సీతంపేట గ్రామానికి చెందిన బిడ్డిక ఉషారాణి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని దర్యాప్తులో తేలింది. ఈ కేసులో రెడ్డి భువనేశ్వర్, సవరిగన తేజేశ్వరరావు, తెగల కృపారాణిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్, బంగారు గొలుసు, పాన్ కార్డు, సర్జికల్ గ్లౌజులను స్వాధీనం చేసుకున్నారు. ఉషారాణిని మత్తు మందులు ఇచ్చి హత్య చేసి మృతదేహాన్ని చెరువులో పడేసినట్లు పోలీసులు వెల్లడించారు. మన్యం జిల్లా ఎస్పీ ఎస్. వి. మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు పాలకొండ డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకున్నాయి.