Jan 28, 2026, 05:01 IST/
ల్యాండింగ్ గేర్ లేకుండానే దిగిన నాసా విమానం.. చెలరేగిన మంటలు
Jan 28, 2026, 05:01 IST
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 'నాసా'కు చెందిన ఓ రీసెర్చ్ విమానం ల్యాండింగ్ గేర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో హ్యూస్టన్లోని ఎల్లింగ్టన్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. ల్యాండింగ్ సమయంలో విమానం వెనుక భాగం నుంచి మంటలు చెలరేగడంతో భారీగా పొగలు కమ్ముకున్నాయి. విమానాశ్రయ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం నుంచి విమానంలోని సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై నాసా దర్యాఫ్తునకు ఆదేశించింది.