దళితుల హక్కులపై అవగాహన

1325చూసినవారు
దళితుల హక్కులపై అవగాహన
సంతకవిటి మండలంలోని కాకరపల్లి గ్రామంలో మంగళవారం సివిల్ రైట్స్ డే సందర్భంగా దళితుల రాజ్యాంగ న్యాయపరమైన హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్ఐ కృపారావు మాట్లాడుతూ దళితులపై వివక్ష చూపినా, హక్కులను కాలరాసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో దళితులపై వివక్ష, వేధింపులు లేదా అన్యాయం జరిగితే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓ శ్రీరాములు, టీడీపీ యువనేత గెడ్డాపు జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్