రాజాం నియోజకవర్గం సంతకవిటి మండలం హోoజారాం గ్రామానికి చెందిన బోడ లక్ష్మణరావు, ఇదే గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో పీఈటీ మాస్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయనను శనివారం బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్
ఇండియా వారు జాతీయ స్థాయి క్రీడా పోటీలకు న్యాయనిర్ణేతగా నియమించారు. మారుమూల గ్రామం నుండి జాతీయ క్రీడలకు న్యాయనిర్ణేతగా ఎంపికవడం పట్ల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.