రాజాంలో తనిఖీలు.. మద్యం సేవించిన వారిపై కేసులు

74చూసినవారు
రాజాంలో తనిఖీలు.. మద్యం సేవించిన వారిపై కేసులు
రాజాం పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు శుక్రవారం సాయంత్రం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. సీఐ కె. అశోక్ కుమార్ ఆధ్వర్యంలో కొండంపేట రోడ్డు జంక్షన్, డోలపేట, గాయత్రి కాలనీలలో ఎస్సైలు ఉమా వెంకటేశ్వరరావు, చంద్ర సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మద్యం సేవించి నిర్లక్ష్యంగా ఆటోలు నడిపిన ఇద్దరిపై డ్రంక్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 7 మందిపై కూడా కేసులు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్