రాజాం మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులకు శుక్రవారం తాగునీటి సరఫరా ఉండదని కమిషనర్ ఎ. రామచంద్రరావు తెలిపారు. రేగిడి మండలంలో విద్యుత్ సబ్‌స్టేషన్ మరమ్మతుల కారణంగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విద్యుత్ అంతరాయం వల్ల తాగునీటి పంపింగ్ సాధ్యం కాదని, దీంతో రాజాం పట్టణంలోని 24 వార్డులకు నీటి సరఫరా నిలిచిపోతుందని వెల్లడించారు.