రాజాం మండలం కంచరాం గ్రామంలో కిల్లన వీధిలో రెండు కరెంట్ స్తంభాల వద్ద సర్వీస్ వైర్లు క్రిందకు వేలాడుతూ, ఐరన్ మెటీరియల్ పూర్తిగా చెడిపోయి ఉండటంతో అవి పడిపోయే ప్రమాదం నెలకొంది. నిరంతరం జనసంచారం, పిల్లలు తిరిగే ప్రాంతం కావడంతో వెంటనే విద్యుత్ శాఖ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోలేదని, ఈ సమస్యకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.