వోల్టేజ్ సమస్యల నివారణకు చర్యలు

124చూసినవారు
వోల్టేజ్ సమస్యల నివారణకు చర్యలు
వంగర మండలంలో వోల్టేజ్ సమస్యలను తగ్గించేందుకు రూ. 25 లక్షల వ్యయంతో ఐదు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సురేష్ బాబు తెలిపారు. శుక్రవారం ఆయన వంగర, ఎం. సీతారాంపురం, మద్దివలస, రాజులగుమ్మడ, పట్టువర్ధనం, కిన్జంగి గ్రామాలను సందర్శించారు. మండలంలో కొత్త విద్యుత్ లైన్లను ఏర్పాటు చేస్తున్నామని, విద్యుత్ స్తంభాల మధ్య దూరాన్ని తగ్గించి అదనపు స్తంభాలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఈ సాంబశివరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్