రాజాం లో పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

1545చూసినవారు
విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇంటింటికీ వెళ్లి ఎమ్మెల్యే కొండ్రు మురళి మోహన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ పరమావధి అని, గత ప్రభుత్వంలో పెన్షన్లు రద్దు చేసేవారని, కానీ నేడు పేదలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో పెన్షన్లు అందజేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 63 లక్షల మందికి నెలకు రూ. 33,100 ఖర్చు చేస్తున్నామని, ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్