పోలియో చుక్కలు పిల్లల జీవితానికి రక్షణ: ఎంఎల్‌హెచ్‌ఓ

1003చూసినవారు
పోలియో చుక్కలు పిల్లల జీవితానికి రక్షణ: ఎంఎల్‌హెచ్‌ఓ
ఆమదాలవలస మండలం పరిధిలోని బెలమాం, లొద్దలపేట గ్రామాల్లో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా ఎంఎల్‌హెచ్‌ఓ ఎస్. లలిత మాట్లాడుతూ, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయడం ద్వారా పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చని, రెండు పోలియో చుక్కలు పిల్లల జీవితానికి రక్షణ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్