సంతకవిటిలో పల్స్ పోలియో కార్యక్రమం: చిన్నారులకు చుక్కలు వేసిన మాజీ సర్పంచ్

63చూసినవారు
సంతకవిటిలో పల్స్ పోలియో కార్యక్రమం: చిన్నారులకు చుక్కలు వేసిన మాజీ సర్పంచ్
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం సంతకవిటి మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం PHC ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గట్టి బాను చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పోలియో వ్యాధి నివారణకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి నాగేంద్రప్రసాద్, హెల్త్ అసిస్టెంట్ స్వామి నాయుడు, ఆశ వర్కర్ సుగుణా, పీ.హెచ్.సి సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్