ఉపకేంద్రం మరమ్మతులు: 21 గ్రామాలకు విద్యుత్ అంతరాయం

372చూసినవారు
ఉపకేంద్రం మరమ్మతులు: 21 గ్రామాలకు విద్యుత్ అంతరాయం
విజయనగరం గ్రామీణ ఈఈ జి. సురేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం, సంతకవిటి మండల పరిధిలోని గుళ్లసీతారాంపురం 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మతుల పనుల కారణంగా ఈ నెల 30న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. ఈ అంతరాయం వల్ల సంతకవిటి మండలంలోని 11 గ్రామాలు, రేగిడి మండల పరిధిలోని 10 గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ప్రజలు ఈ విషయంలో సహకరించాలని కోరారు.