వంగర మండలం అరసాడ గ్రామంలో ఆదివారం గ్రామ సభ జరిగింది. మాజీ సర్పంచ్, రాజాం ఏఎంసి వైస్ చైర్మన్ లచ్చుభుక్తి ధనలక్ష్మి కృష్ణమూర్తి, సీనియర్
టీడీపీ నాయకులు మజ్జి వెంకట్ నాయుడు, దొంతల దుర్గారావు సమక్షంలో జరిగిన ఈ సభలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, డప్పు కళాకారుల పెన్షన్ల విషయమై చర్చించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కూటమి ప్రభుత్వం నుంచి పెన్షన్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. ఈ సభలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.