
ఉగాది నాటికి 5, 234 ఇళ్ల పూర్తి లక్ష్యం: హౌసింగ్ ఈఈ
ఇల్లు లేని పేదల కోసం ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టింది. పార్వతీపురం డివిజన్లో పీఎం-ఏవై కింద 13,134 మంది లబ్ధిదారులను గుర్తించారు. మక్కువ మండలంలో 1,276 ఇళ్లు పూర్తయ్యాయి, మిగిలినవి త్వరలో పూర్తవుతాయి. వచ్చే ఉగాది నాటికి 5,234 ఇళ్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రణాళిక సిద్ధమైందని హౌసింగ్ ఈఈ జి. సోమేశ్వరరావు తెలిపారు. లబ్ధిదారులు వెంటనే నిర్మాణాలు ప్రారంభించాలని సూచించారు.

































