సాలూరులో ఏసీబీ సోదాలు

605చూసినవారు
సాలూరులో ఏసీబీ సోదాలు
గురువారం, సాలూరు పట్టణానికి చెందిన లారీ ఓనర్స్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు ఇండుపూరి నారాయణరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. విశాఖపట్నం పంచాయితీ రాజ్ శాఖకు చెందిన విశ్రాంత సూపరింటెండెంట్ ఇంజనీర్ కళ్ళేపల్లి శ్రీనివాసరావు బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, విశాఖపట్నం మధురవాడ, సాలూరులో ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. అవినీతి ఆరోపణలపై ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్