మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్ష

521చూసినవారు
మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్ష
పాచిపెంట ఎస్ఐ అర్జున్ మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సాలూరు మెజిస్ట్రేట్ కోర్టు ముగ్గురు వ్యక్తులపై శిక్షలు విధించింది. ఒకరికి రెండు రోజుల జైలు శిక్ష, మరో ఇద్దరికి పది వేల రూపాయల చొప్పున జరిమానా విధించారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగి కుటుంబాలు ఇబ్బందులు పడతాయని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్