ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైల్డ్ రైట్స్ అడ్వకసి ఫోరం బుధవారం విజయవాడ స్వర్ణ ప్యాలస్ లో చైల్డ్ ఫ్రెండ్లీ విలేజస్ అంశంపై నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సదస్సులో విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కోమటి పల్లి గ్రామానికి చెందిన ప్రముఖ తూర్పు భాగవత కళాకారులు మరియు సామాజిక కార్యకర్త డాక్టర్ బొంతలకోటి శంకర రావు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎ.పి.క్రాప్ డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సెస్ నుంచి మెయిల్ ద్వారా ఆహ్వాన పత్రం వచ్చిందని తెలిపారు. బాలల స్నేహ పూర్వక గ్రామాలపై పూర్తి స్థాయిలో పని చేస్తామని చెప్పారు.