మండలాల వారీగా వైసీపీ కమిటీల ఏర్పాటుకు దృష్టి

125చూసినవారు
మండలాల వారీగా వైసీపీ కమిటీల ఏర్పాటుకు దృష్టి
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా మెంటాడ మండలం మెంటాడ, పిట్టాడ పంచాయతీల వైసీపీ కమిటీల జాబితాలను గురువారం సాలూరు పట్టణంలో మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొరకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన కమిటీలను అభినందిస్తూ, మిగతా పంచాయతీల కమిటీలను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సాలూరు నియోజకవర్గంలోని ఇతర మండలాల్లోనూ కమిటీల నిర్మాణం వేగవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్