ముత్యాలమ్మను దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర

మక్కువ మండల పరిధిలోని కవిరిపల్లి గ్రామ దేవత ముత్యాలమ్మ పండుగ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలందరిపై ముత్యాలమ్మ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు మావుడి శ్రీనివాసరావు, వైఎస్ఆర్సిపి మండల పార్టీ అధ్యక్షుడు మావుడి రంగనాయుడు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
