మన్యం జిల్లా సాలూరు నేషనల్ హైవేపై ఆర్టీసీ బస్సును జియో ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. అయితే వర్షం కారణంగా బస్సును వెనుక నుంచి మరో కారు కూడా ఢీకొనడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. బస్సు సాలూరు నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళకు తీవ్ర గాయాలవడంతో ఆమెను సాలూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.