మన్యం జిల్లాలో మక్కువ–బాగవలస–సాలూరు రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శనివారం మక్కువ మెయిన్ రోడ్‌లో నిరసన చేపట్టారు. సీఐటీయూ జిల్లా నాయకులు కొల్లి గంగు నాయుడు, ఎన్. వై. నాయుడు మాట్లాడుతూ, ఆరు సంవత్సరాలుగా రహదారి పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ద్విచక్రవాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని, దీంతో మామిడిపల్లి మార్గం ద్వారా వెళ్లాల్సి వస్తోందని తెలిపారు.