పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఇటీవల నిర్మించిన అన్నా క్యాంటీన్ ను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సోమవారం ప్రారంభించారు. పేదవాడికి కడుపునిండా అన్నం, తక్కువ ధరకే తినాలనే ఉద్దేశంతో స్వర్గీయ
ఎన్టీఆర్ ఆశయాలు నెరవేరాలని ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ప్రారంభించిందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టిడిపి కార్యకర్తలు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.