మహాశివరాత్రి సందర్భంగా పాచిపెంట మండలం పారమ్మకొండ జాతర ఏర్పాట్లపై సాలూరు మంత్రి సంధ్యారాణి గురువారం అధికారులతో, ఆలయ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య శిబిరాలు, ట్రాఫిక్ నియంత్రణ, పోలీసు భద్రత వంటి ఏర్పాట్లను మెరుగుపరచాలని ఆదేశించారు. జాతరను ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని సూచించారు.