అనుమతి లేకుండా గోవుల తరలింపు భగ్నం

104చూసినవారు
అనుమతి లేకుండా గోవుల తరలింపు భగ్నం
సాలూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 27 గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. గోవుల అక్రమ తరలింపుపై అందిన సమాచారంతో వాహన తనిఖీలు నిర్వహించగా, అనుమతి లేకుండా తరలిస్తున్నట్లు గుర్తించారు. చట్టబద్ధమైన పత్రాలు లేకపోవడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పశు క్రూరత్వ నిరోధక చట్టం సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న గోవులను సంరక్షణ కేంద్రానికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్