గురువారం పాచిపెంట, కొమరాడ, సాలూరు మండలాలకు చెందిన నూనె గింజలు పండించే గిరిజన రైతులకు బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లోని మహి ఆయిల్ ఫ్యాక్టరీకి విజ్ఞాన యాత్ర నిర్వహించినట్లు వ్యవసాయ శాఖ అధికారి కొల్లి తిరుపతిరావు తెలిపారు. వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు పంటలకు జిల్లాలో విస్తృత అవకాశాలున్నాయని, రైతులు పండిస్తే మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని కంపెనీ ప్రతినిధి రెడ్డి ఈశ్వరరావు తెలిపారు. ఈ ఖరీఫ్ నుంచి రాయితీ విత్తనాల పంపిణీకి ప్రణాళికలు సిద్ధమయ్యాయని, అనంతరం రైతులు నూనె తయారీ విధానాన్ని ఆసక్తిగా తిలకించారని పేర్కొన్నారు.