మన్యం జిల్లాను ఆంధ్రా ఊటీలా తీర్చిదిద్దుతాం.. కలెక్టర్

106చూసినవారు
పార్వతీపురం జిల్లా కలెక్టర్ డా. ఎన్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మన్యం జిల్లా సహజసిద్ధమైన సౌందర్యాలకు కేరాఫ్ అడ్రస్ అని, జలపాతాల ఖిల్లాగా పేరొందిన ఈ జిల్లాను మరో ఆంధ్రా ఊటీలా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని గురువారం తెలిపారు. సాలూరు మండలం కొదమ గిరిజన పంచాయతీ పరిధిలోని మహా లొద్ద జలపాతం ప్రారంభోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జిల్లాలోని సహజ జలపాతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసి, రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షించేందుకు చర్యలు చేపడుతున్నామని, దీనివల్ల స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడి, ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్