సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం దుగ్గేరు ప్రాంతంలో గిరిజనులకు అడారి గెడ్డ కష్టాలు కొనసాగుతున్నాయి. గుంటభద్ర గ్రామ మహిళలు కూలిపనుల అనంతరం తిరిగి వస్తుండగా వరద ఉధృతి కారణంగా కాజ్‌వే ముంపునకు గురైంది. గ్రామ పెద్దలు తాళ్ల సహాయంతో ప్రమాదకరంగా ఒక్కొక్కరిని దాటించి రక్షించారు. వర్షాకాలంలో 20కి పైగా గ్రామాలు ఇదే సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం లేక వంతెన నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు.