
న్యాయం చేయండి మహాప్రభో... దళిత మహిళ ఫిర్యాదు
సాలూరు నియోజకవర్గం డి. సిర్లాం గ్రామానికి చెందిన జోష్ణ, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మన్యం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తన తల్లి ఆశ కార్యకర్త విద్యావతిని స్థానిక టిడిపి నాయకుడు దాకేటి గౌరీ నాయుడు తప్పుడు ఫిర్యాదు చేశారని, వైద్యాధికారి హరికృష్ణ విచారణ చేయకుండా విధుల నుండి తొలగించారని ఆమె ఆరోపించారు. తిరిగి విధుల్లో చేర్చాలని ఆదేశాలు వచ్చినా అమలు కాలేదని, ఈ అన్యాయంతో మనస్తాపం చెంది తల్లి మరణించిందని జోష్ణ కన్నీరు పెట్టుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.






































