
శ్రీ పోలమాంబ అమ్మవారి 2026 జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం
మన్యం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో కొలువైన ఉత్తరాంధ్ర ఇలవేల్పు, గిరిజనుల ఆరాధ్య దేవత శ్రీ పోలమాంబ అమ్మవారి 2026 జాతర మహోత్సవాలు సిరిమాను సంబరాలతో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ జాతరగా గుర్తింపు పొందిన ఈ జాతర ఏర్పాట్లపై నేడు రాష్ట్ర గిరిజన, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ సమక్షంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం జరుగుతుందని ఆలయ కార్యనిర్వక అధికారి బి. శ్రీనివాస్ తెలిపారు. ఈ సమావేశంలో జాతర నిర్వహణకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.




































