
రాజీపేటలో గౌరీపార్వతుల నిమజ్జనోత్సవం
శృంగువరపుకోట మండలం రాజీపేట గ్రామంలో శనివారం రాత్రి గౌరీపార్వతుల నిమజ్జనోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఉత్సవంలో భాగంగా, గ్రామ ప్రజలు గౌరీ పార్వతులను తమ తలపై పెట్టుకుని గ్రామమంతా ఊరేగించారు. ప్రతి సంవత్సరం ఇదే పద్ధతిలో గౌరీపార్వతుల ఉత్సవాలను నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. డిజె సౌండ్స్, బాణసంచా, తీన్మార్ డప్పుల హోరుతో, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆనందోత్సాహాలతో చిందులు వేస్తూ గౌరీ పార్వతుల నిమజ్జనాన్ని ఘనంగా జరుపుకున్నారు.






































