పెదఖండేపల్లిలో కొవ్వొత్తులతో మాజీ ముఖ్యమంత్రికి ఘన నివాళులు

4చూసినవారు
పెదఖండేపల్లిలో కొవ్వొత్తులతో మాజీ ముఖ్యమంత్రికి ఘన నివాళులు
శృంగవరపుకోట మండల పెదఖండేపల్లి గ్రామంలో బుధవారం రాత్రి మాజీ ముఖ్య మంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి ప్రజలు పెద్ద ఎత్తున చేరి ఘన నివాళులు అర్పించారు. ముందుగా రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి జోహారు వైఎస్ఆర్ అని నినాదాలు చేశారు. అనంతరం అభిమానులు అందరూ కొవ్వొత్తులు వెలిగిస్తూ, గ్రామ పురవీధులలో రాజశేఖర్ రెడ్డిని తలుచుకుంటూ జోహార్ వైయస్ఆర్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్