శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఎల్‌కోట మండలం మార్లపల్లిలో పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కృత్రిమ గర్భాదారణ ద్వారా జన్మించిన ఆడదూడల ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పాడి పశువుల అభివృద్ధికి తనవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని, పశుపోషణ రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని, పాడి పరిశ్రమ అభివృద్ధితో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని తెలిపారు. కొత్తవలస, ఎల్‌కోట మండలాలకు 700 గోశాలలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని పశుసంవర్థక శాఖ డీడీ దామోదర్ రావు, ఏడీఏ కన్నం నాయుడు నిర్వహించారు.