ఉపాధి హామీ పథకంపై అవగాహన కార్యక్రమం

112చూసినవారు
ఎస్.కోట గ్రామపంచాయతీ ఎస్సీ కాలనీలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం లబ్ధిదారులకు నూతన చట్టంపై అవగాహన శనివారం కల్పించారు. ఈ పథకం ద్వారా సంవత్సరానికి 125 రోజులు పని దినాలు, 25% అదనపు ఆదాయం లభిస్తుందని, పని కల్పించని యెడల ప్రభుత్వమే నేరుగా ఖాతాలో డబ్బులు జమ చేస్తుందని, చేసిన పనికి వారం రోజుల్లోనే చెల్లింపులు జరుగుతాయని జిల్లా కోకన్వీనర్ దొడ్డి సూర్యారావు తెలిపారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంపై ఫైన్ విధించి, ఆ డబ్బులను కూడా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ చట్టంపై అపోహలు ప్రచారం చేసే వారిని నమ్మవద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్