విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్, తప్పులన్నీ సరిదిద్దిన తర్వాతే పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. గురువారం శృంగవరపుకోట మండలం లచ్చింపేటలో భూసంబంధిత రికార్డుల పరిశీలన ప్రక్రియను ఆయన తనిఖీ చేశారు. మార్చి నెలకు సంబంధించి గ్రామంలో 851 ఖాతాలను పరిశీలించాలని, రికార్డుల్లో పొరపాట్లు లేకుండా సమగ్రంగా పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. పనుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.