పాటూరులో ఘనంగా రమా ఏకాదశి వేడుకలు..స్వామివారికి విశేష పూజలు

3చూసినవారు
పాటూరులో ఘనంగా రమా ఏకాదశి వేడుకలు..స్వామివారికి విశేష పూజలు
విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం పాటూరు గ్రామంలోని 826 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్ధన స్వామివారి దేవాలయంలో గురువారం రమా ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకం మరియు అలంకారాలు చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిని చాటుకున్నారు. సాయంత్రం భజన కార్యక్రమాలు ఉంటాయని ఆలయ అర్చకులు పి.వి.యెస్. ప్రసాదాచార్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్