శృంగవరపుకోట జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో బుధవారం జరిగిన బార్ అసోసియేషన్
ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. ఎన్నికల అధికారిగా మామిడి చంద్రశేఖర్ వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో అల్లు సత్యజి అధ్యక్షుడిగా, ఎం. దొరబాబు కార్యదర్శిగా, బి. రామకృష్ణ ఉపాధ్యక్షుడిగా, బి. వెంకటరావు జాయింట్ సెక్రటరీగా, ఆర్. సత్యనారాయణ కోశాధికారిగా, డబ్ల్యు. ఎన్. శర్మ మీడియా కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఎన్నికల అనంతరం నూతనంగా ఎన్నికైన ప్రతినిధులు జడ్జి కనకలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిశారు.