జామి మండలంలో విద్యుత్ సమస్యకు పరిష్కారం

293చూసినవారు
జామి మండలంలో విద్యుత్ సమస్యకు పరిష్కారం
జామి మండల కేంద్రంలోని జంగాలకాలనీ నుంచి గొల్లవానిపాలెం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని స్థానికులు శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి దృష్టికి తీసుకెళ్లగా ఆమె వెంటనే స్పందించారు. విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. తక్షణమే పనులు చేపట్టి కాలనీ వాసులకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. దీంతో స్థానికులు ఊరట పొందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్