ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. జామి మండలం జాగరం గ్రామంలో 15. 7 లక్షల వ్యయంతో నిర్మించనున్న గోకులం షెడ్లు, చేతి బోరు నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని స్పష్టం చేశారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కొనియాడారు. కార్యక్రమంలో ఎస్. కోట నియోజకవర్గ కూటమి నాయకులు పాల్గొన్నారు.