వేపాడ మండలంలోని వీలుపర్తి పంచాయతీ వెళ్లాం గ్రామంలో బుధవారం 15 అడుగుల గిరినాగు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. వెలమల వీధిలోని మురుగు కాలువలో పాము సంచరిస్తుండటాన్ని గమనించిన స్థానికులు స్నేక్ కేచర్ రాజేష్‌కు సమాచారం అందించారు. ఆయన వెంటనే అక్కడికి చేరుకుని, పామును సురక్షితంగా పట్టుకుని సమీప అడవిలో విడిచిపెట్టారు. దీంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు.