విజయనగరం లో భయభ్రాంతులకు గురి చేస్తున్న అపరిచితుడు

7చూసినవారు
విజయనగరం లో భయభ్రాంతులకు గురి చేస్తున్న అపరిచితుడు
విజయనగరం పట్టణంలోని కంటోన్మెంట్ హై స్కూల్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఏపీ సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. ఈ వ్యక్తి ఇటీవల ఒక స్థానికుడిపై రాయితో దాడి చేశాడని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యపై అధికారులు స్పందించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, అలాగే అపరిచితులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని శ్రీనివాసరావు కోరారు. ఈ సంఘటన విజయనగరం పట్టణంలో కలకలం సృష్టించింది.