విజయనగరంలో ఆదివారం వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ ధ్వతీయ అధ్యక్షులు జానికీ లాల్ తోషినివాల్ వర్ధంతి సందర్భంగా అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ సభ్యులు ఆయనకు నివాళులర్పించారు. క్లబ్ అధ్యక్షులు సి హెచ్. రమణ ఆధ్వర్యంలో 42వ డివిజన్ కామాక్షి నగర్, అయ్యన్నపేట జంక్షన్ వద్దనున్న మున్సిపల్ నడక మైదానంలో తోషినివాల్ చిత్రపటానికి పూలమాల వేసి సభ్యులంతా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.