ఖాళీ బార్ల లైసెన్సులకు దరఖాస్తుల ఆహ్వానం

237చూసినవారు
ఖాళీ బార్ల లైసెన్సులకు దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం జిల్లాలో ఖాళీగా ఉన్న బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరిటెండెంట్ బి. శ్రీనాధుడు తెలిపారు. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని ఎనిమిది బార్లకు ఒక్కోదానికి రూ. 55 లక్షలు, బొబ్బిలి మునిసిపాలిటీలోని ఒక బారుకు రూ. 55 లక్షలు, రాజాం నగరపంచాయతీలోని రెండు బార్లకు ఒక్కోదానికి రూ. 35 లక్షలు రుసుముగా నిర్ణయించారు. అర్హులైన వారు ఫిబ్రవరి 4 సాయంత్రం 6 గంటలలోపు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 5న కలెక్టర్ సమక్షంలో లాటరీ ద్వారా ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్