విజయనగరం ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 13న ఉదయం 9 గంటలకు ప్రధానమంత్రి అప్రెంటిస్ షిప్ మేళా జరగనుంది. ఐటీఐ ఉత్తీర్ణులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కన్వీనర్ టి. వి. గిరి తెలిపారు. ఈ మేళాలో మ్యాట్రిక్స్ లేబొరేటరీ, వరుణ్ మోటార్స్, జయభేరి ఆటోమోటివ్, శ్యాంసంగ్, ఐఎఫ్‌బీ, వోల్టాస్, ఎల్జీ, రేడియంట్ ఎలక్ట్రానిక్స్, క్యూసివ్ టెక్నాలజీ సంస్థలు పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేస్తాయి. అభ్యర్థులు తమ బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్, రెండు ఫోటోలతో హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9441518355, 9703179119 నంబర్లను సంప్రదించవచ్చు.