విజయనగరం జిల్లాలో 407 మంది జర్నలిస్టులకు మీడియా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ నిర్ణయించింది. జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్డులు పెద్ద, చిన్న, దిన, మాసపత్రికలు, శాటిలైట్ టీవీ ఛానళ్లు, కేబుల్, ఫైబర్ నెట్, ప్రభుత్వ మీడియాకు చెందిన వారికి అందజేయబడతాయి. కన్వీనర్‌గా జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి పి. గోవిందరాజులు వ్యవహరించారు. సమావేశంలో కమిటీ సభ్యులు, ఎక్స్ ఆఫీసియో సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.